ముక్తాయిస్4U - హాస్య కథానిక.
'ముక్తాయిస్4U'
"ఒరేయ్
అప్పల్రాజూ, కచేరీకింకా
అరగంటే
టైముందిరా, ఒక్క
ముక్తాయి
కూడా
ఆలోచించలేదు.
అసలే
సీతారాణి
పాట.
ఆవిడకి
పల్లవుల
పిచ్చి.
మనశ్శాంతిగా
ఉంటుంది
ఆదితాళం
సమానికి
పాడుకోవచ్చు
కదా, పైకాలం
మూడక్షరాల
జాగా
ఎందుకో? జాగాకి
పాడితే
ఓ
ఐదొందలు
ఎక్కువిస్తారా
యేఁవిటి? సహకార
వాద్యాలనేడిపించడానికి
కాకపోతే?"
"ఒరేయ్
వీర్రాజూ, మధ్యాహ్నమంతా
దుప్పటి
ముసుగుతన్ని
పడుక్కుని
ఇప్పుడు
సణిగితే
ప్రయోజనమేఁవిట్రా? ఆవిడ
పల్లవి
పాడుతుందని
కచేరీ
ఒప్పుకున్నప్పుడు
తెలీదా
యేఁవిటి? పొద్దస్తమానం
సెల్లో
చాటింగ్లు
చేసి
ఇప్పుడు
గింజుకుంటే
ఉపయోగమేఁవిటీ?
"ఒరేయ్
దెప్పింది
చాలుగానీ, ఓ
రెండు
మంచి
ముక్తాయిలు
చెప్పరా, పాత
ముక్తాయిలు
మైకులు
పెట్టే
భాస్కర్కి
కూడా
కంఠతా
వచ్చేసాయి."
"నీలాటి
బద్ధకస్తులు
పెరిగిపోవడం
వలనే, ఒళ్ళలియకుండా, మెదడు
శ్రమ
పడకుండా
అన్ని
పనులూ
కూర్చున్న
చోటనుంచే
అయిపోవాలనుకునేవాళ్లు
పెరిగిపోవడం
వలనే
ఆన్లైన్
వ్యాపారాలు
విపరీతంగా
పెరిగిపోయాయి.
బిల్లులు
కట్టడానికీ, సరుకులు
తెచ్చుకోవడానికీ, రిజర్వేషన్లకీ,
సమస్తం
ఆన్లైనే, అన్నిటికీ
యాప్లే.
ఈ
మధ్యనే
ముక్తాయిలు
లెక్కగట్టడానికి
కూడా
ఏదో
యాప్
వచ్చిందట.
మొన్న
డిసెంబర్
సీజన్లో
వెయ్యిమందికి
పైగా
లాగిన్
అయ్యారట.
మనకు
కావాల్సిన
తాళం,గతి,జాగా,కాలం
వగైరా
వివరాలన్నీ
అందులో
ఎంటర్
చేస్తే
పావుగంటలో
ముక్తాయి
నొటేషన్, ఆడియో
రెండూ
వచ్చేస్తాయట.
"నెత్తిన
పాలుపోసేవుగా, కొంచెం
డౌన్లోడ్
చేసిపెట్టరా, నాకు
టైమైపోతోంది"
"సలహా
ఇచ్చినందుకు
నా
నెత్తినే
కిరీటం
పెడతావట్రా?సరే, ఆ
సెల్లిలా
తగలెయ్యి"
నడ్డికి
తుండు
చుట్టుకుని
బాత్రూమ్లోకి
పరిగెత్తాడు
వీర్రాజు.
నీళ్ళ
చప్పుడూ, అది
ఆగినప్ఫడు
'తధ్ధిత్తకుదిన
తొం, తధిగిణతొం'
అంటూ
ఏవో
సణుగుళ్లూ
బాత్రూంలోంచి
వినిపిస్తున్నాయి.
రెండు
నిమిషాల్లో
బయటకొచ్చి
అప్పల్రాజు
చేతిలో
సెల్
లాక్కుని
మంచం
మీద
కూలబడ్డాడు.
'MUKTAYIS4U' Professional
standard muktayis
by experts at reasonable prices. Just a click away.
Developers: SADGURU TECHNOLOGIES.
అందంగా
మెరుస్తున్నాయి
అక్షరాలు.
డబ్బులు
కట్టాలా? వీర్రాజు
మొహం
కొంచెం
నల్లబడింది.
'టైం
లేదు. సరే దీని
సంగతేంటో
తేలుద్దాం' అనుకున్నాడు.
ʘMember login. ʘGuest login అని కనిపించాయి.
ఒకసారి
దీని
సంగతేంటో
చూసిన
తర్వాత
మెంబరవ్వచ్చులే
అనుకుని
గెస్ట్
లాగినయ్యాడు.
'CHOOSE
YOUR LANGUAGE' అని స్క్రీన్
మీద
కనిపించింది.
పక్కనే
మెనూలో
ఉన్న
భాషల్లో
తెలుగును
క్లిక్
చేశాడు.
ఒక్కొక్కటిగా
ప్రశ్నలు
రావడం
మొదలెట్టాయి.
'మీకు కావాల్సిన తాళాన్ని ఎంచుకోండి'
ʘసప్త తాళాలు ʘచాపు తాళాలు
సప్త
తాళాలు
మీద
నొక్కాడు.
వెంటనే
స్క్రీన్
పై
ఒక
పక్కన
100/-
అని
మెరిసింది.
వీర్రాజుకి
చిన్నగా
షాక్కొట్టింది.
కిందనే
సప్తతాళాల
చిట్టా
వచ్చింది.
త్రిపుట
తాళం
మీద
భయంగా
ఒత్తాడు.100/-
కాస్తా
150/-
అయ్యింది.
'మీకు కావలసిన జాతిని ఎంచుకోండి' అని ప్రత్యక్షమైంది. కిందనే 5 జాతులూ కనిపించాయి. వణుకుతున్న వేలుతో 'చతురశ్ర' మీద నొక్కాడు. రుసుమేమీ మారలేదు. 'అమ్మయ్య ఆదితాళమే అన్నిటికన్నా చవకన్నమాట' అనుకున్నాడు.
'జాగాను ఎంచుకోండి' అని ప్రత్యక్షమైంది.
ʘఅనాగత
ʘఅతీత అని
కనిపించింది.
అనాగత
సెలెక్ట్
చేశాడు.
రుసుమేం
మారలేదు.
'అమ్మయ్య
సీతాలు
అతీతంలో
పాడట్లేదు
బతికించింది' అని
ఊపిరి
పీల్చుకున్నాడు.
కాలాన్ని
ఎంచుకోండి: ʘమధ్యమ ʘచౌక
మధ్యమ
మీద
నొక్కాడు.
ఇప్పుడు
కూడా
రేటు
మారలేదు.
జాగా
అక్షరాలను
ఎంచుకోండి ʘ1 ʘ2 ʘ3
ʘ6
'3'ని
సెలెక్ట్
చేశాడు.
రేటు
250
అయి
కూర్చుంది.
వీర్రాజుకి
తిక్కతిక్కగా
ఉంది.
ఆవృత్తాల
సంఖ్యను
ఎంచుకోండి
ʘ1
ʘ2 ʘ3 ʘ4 ʘఎక్కువ
కొంచెం
పెద్ద
ముక్తాయి
అయితే
బాగుంటుంది
కదా
అని
మనసేదో
కీడును
శంకిస్తూ
ఉండగానే
4 మీద మౌస్ని
ఒత్తాడు.
అంతే, వేలింకా
వెనక్కి
తీయక
ముందే
రేటు
మూడొందలైంది.
వీర్రాజుకి
చికాకు
తారస్థాయికి
చేరింది.
మీకు
కావలసిన
గతిని
ఎంచుకోండి
ʘ3 ʘ4 ʘ5
ʘ7 ʘ9
'ఈ
ప్రశ్నలు
ఆగేదెప్పుడు? వీడి
ముక్తాయి
వచ్చేడిసేదెప్పుడు?' తనని
తానే
తిట్టుకుంటూ
మూడు
మీద
నొక్కాడు.
అంతే, గట్టిగా
బీప్
సౌండ్
వచ్చింది.
డిస్ప్లే
ఎర్రరంగులోకి
మారింది.
'క్షమించండి. 3 అక్షరాల జాగాకి చతురశ్ర గతిలో మాత్రమే ముక్తాయిలుంటాయి.' అని ఫ్లాష్ అయింది.
'ఓరి
దీని
అసాధ్యం
కూలా!
దీన్ని
తయారుచేసినవాడు
సామాన్యుడు
కాడ'నుకున్నాడు.
'సరే' అన్న
బటన్పై
నొక్కాడు.
స్క్రీన్
మారింది.
ముక్తాయి
కాలం:
ʘమధ్యమకాలం
ʘపైకాలం
పైకాలం
సెలెక్ట్
చేశాడు
అంతే
రేటు
400/-
అయ్యింది.
వీర్రాజుకి
కంపరంగా
ఉంది.
మీకు
ముక్తాయి
ఎంత
సేపట్లో
కావాలి?
ʘ10
నిమిషాలు
ʘఅరగంట
ʘ2 గంటలు
వీర్రాజు
తెగించేశాడు.
దీనంతు
చూద్దామని
పదినిమిషాలని
సెలెక్ట్
చేశాడు.
అనుకున్నంతా
అయ్యింది.
రేటు
500/-
అయింది.
ఇంక
ప్రశ్నలు
ఏం
రాలేదు.
నిట్టూరుస్తూ
తుండుతో
చెమట
ఒత్తుకున్నాడు.
'షరతులను
అంగీకరిస్తున్నాను' బాక్స్‌ని
టిక్చేసి OK బటన్
నొక్కాడు.
స్క్రీన్
మారింది.
వీర్రాజు
తుళ్ళి
పడ్డాడు.
యూజర్
చార్జీలు
50/-
GST 50/-
మొత్తం
600/-
చెల్లింపు ఆప్షన్లు: ʘడెబిట్ కార్డ్: 600 /- ʘక్రెడిట్ కార్డ్: 610 /- ʘనెట్ బ్యాంకింగ్: 605 /-
వీర్రాజుకి
కోపం
నషాళానికంటింది.
సెల్
విసిరి
కొడదామా
అన్నంత
కోపం
వచ్చింది.
కానీ
తమాయించుకున్నాడు.
'ఓ
రెండు
ముక్తాయిలు
చెప్పరా
అంటే
ఈ
శనిని
తగిలించేవేమిట్రా' అంటూ
అప్పల్రాజు
మీద
విరుచుకుపడ్డాడు.
యధాలాపంగా
స్క్రీన్ని
పైకి
స్క్రోల్
చేశాడు.
షరతులు:
మీరు
ఎంపిక
చేసుకున్న
తాళం, ఇతర
వివరాలు
వెంటనే
మా
నిపుణులకు
పంపబడతాయి.
రుసుము
చెల్లించిన
పది
నిమిషాలలో
ముక్తాయి
నోటేషన్, ఆడియో
మీ
వాట్సాప్కి
పంపబడతాయి.
అనివార్య
కారణాల
వలన
ముక్తాయి
పంపడం
ఆలస్యమైతే
మీరు
చెల్లించిన
మొత్తంలో
యాభైశాతం, ముక్తాయిని
పంపలేకపోతే
పూర్తి
మొత్తం
రెండు
పని
దినాలలో
మీ
ఎకౌంట్లో
జమ
చేయబడుతుంది.
అంతకుమించి
MUKTAYIS4U
ఎటువంటి
బాధ్యత
వహించదు.
దీనిపై
ఎటువంటి
వాద
వివాదాలకు
తావు
లేదు.
'అంటే, ఇంతాచేసి
తనకి
ముక్తాయి
వస్తుందన్న
గ్యారెంటీ
ఏమీ
లేదని, పంపకపోతే
ఎవర్నీ
నిలదీయ్యలేమనే ధర్మసూక్ష్మం
అర్థమైంది
వీర్రాజుకి.
"కాదేదీ కవితకనర్హం"
అని
మహాకవి
శ్రీశ్రీ
చెప్పినట్లు
"కాదేది వ్యాపారానికనర్హం"
అనుకున్నాడు
వీర్రాజు.
'అప్పల్రాజు
చెప్పింది
నిజమే,
తనలాటి
బద్ధకస్తులు
పెరిగిపోవడం
వల్లనే
ఇలాంటి
వ్యాపారాలు
జోరుగా
సాగుతున్నాయి.
కచేరీల్లో
విన్న, గురువుగారు
చెప్పిన
ముక్తాయిలూ, తగ్గింపులుూ
రాసి
ఉంచుకునుంటే, కచేరీల్లేనప్పడు
ఓ
నాలుగు
ముక్తాయిలు
లెక్కెట్టుకునుంటే
ఇప్పుడీ
బాధుండేది
కాదు
కదా"
అంటూ
తనని
తానే
తిట్టుకుంటూ
నిర్వేదంగా
క్యాన్సిల్
బటన్
నొక్కాడు.
HOME PAGE వచ్చింది. 'ఆఫర్లు' అని కనిపించింది. క్లిక్ చేశాడు.
😊'సభ్యత్వం
తీసుకోండి, మొదటి
ముక్తాయిని
ఉచితంగా
పొందండి.
ఆన్సీజన్లో
తగ్గింపు
ధరలకే
ముక్తాయిలను
పొందండి'.
😊'నిపుణులుగా
చేరండి. ముక్తాయి
రిక్వెస్ట్
మీ
ఫోన్కి
ఫార్వర్డ్
చేయబడుతుంది.
మీ
ముక్తాయిలకి
వినియోగదారుల
రేటింగ్
పెరిగితే
మీ
పారితోషకం
కూడా
పెరుగుతుంది.
ఆసక్తి
కలవారు
తమ
బయోడేటాను www.muktayis4u.com కి
పంపగలరు.
వీర్రాజుకి
నెమ్మదిగా
తత్వం
బోధపడుతోంది.
అంటే, ఈ
సద్గురు
టెక్నాలజీస్
వాడికి
ముక్తాయిలు
తయారు
చేయడం
రాదన్నమాట.
ముక్తాయిలు
కావాల్సిన
వాళ్ళనీ, ముక్తాయిలు
తయారుచేసేవాళ్ళనీ
ఒక
దగ్గరికి
తీసుకొచ్చి, మధ్యలో
వీడు
కమీషన్
కొట్టేస్తున్నాడన్నమాట.
ఓర్నీ!
వీర్రాజుకి
ఏదో
లోకంలో
ఉన్నట్టుంది.
కళ్ళముందు
ఏవేవో
దృశ్యాలు
కనబడుతున్నాయి.
ఇంతలో
ఎట్నుంచో
లీలగా
'కాఫీ
- చాయా - ఇడ్లీ
- వడ - దోశ
- పూరి - ఉప్మా' అంటూ
కేకలు
వినిపించాయి.
కళ్ళు
నులుముకుని
చూశాడు.
చెవులు
రిక్కించి
విన్నాడు.
'భువనేశ్వర్
నుంచి
ముంబయ్
వెళ్ళవలసిన
కోణార్క్
ఎక్స్ప్రెస్
6వ
నెంబర్
ప్లాట్ఫాం
నుండి
బయలుదేరుటకు
సిద్ధముగా
ఉన్నది'
అని
వినిపించింది.
పూర్తిగా
మెలుకువొచ్చింది
వీర్రాజుకి.
టైం
చూసుకున్నాడు.
బండి
ప్లాట్ఫామ్
మీద
ఆగి
పావుగంటైందని
అర్థమైంది.
తన
మెుద్దునిద్రను
తిట్టుకుంటూ
అప్పర్
బెర్త్
మీదనుంచి
ఒక్క
దూకు
దూకి, మృదంగం, బ్యాగ్
పట్టుకుని, ఎదురొస్తున్న
జనాన్ని
తోసుకుంటూ, విజయవాడ
స్టేషన్
6వ
నెంబర్
ప్లాట్
ఫారం
మీద
దిగాడు
వీర్రాజు.
Comments
Post a Comment