ఆంధ్రుల కలలరాజధాని అమరావతి శంఖుస్థాపన సందర్భంగా ఏర్పాటైన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా,
విజయవంతంగా జరిగాయనడంలో ఎటువంటి సందేహంలేదు. అయితే వీటిల్లో తెలుగుదనం, ఆంధ్ర సంస్కృతి ఎంత ఉన్నది?
అనే విషయాన్ని కొద్దిగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. కూచిపూడి నాట్యంలో నాకు ఏ విధమైన ప్రవేశం,
దానితో పరిచయం కానీ లేకపోయినా, ఒక శాప్రీయ సంగీత కళాకారునిగా,
ఒక సామాన్య ప్రేక్షకునిగా చూస్తే నాట్యభాగం వరకు చాలా బాగుంది. అయితే నేపధ్యంలో గానం చేయబడిన పాటలో దైవస్తుతి,
అమరావతి ప్రాశస్త్యం కన్నా ప్రభుత్వ, పాలకుల స్తుతి ఎక్కువగా ఉంది. భగవంతునికి దగ్గరగా తీసుకుపోయేని లలిత కళలు. ప్రభుత్వ ప్రచారానికి వాటిని మాధ్యమంగా ఎంచుకోకూడదు. అమరావతి నిర్మాణానికి దైవబలం కూడా కలనిరావాలని పాలకులు భావించినపుడు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా తదనుగుణంగానే ఉందాలి. ఈ శంఖుస్థాపన సందర్భంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆంధ్రుల సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబించేందుకు ఉద్దేశించబడ్డాయి. కేవలం ప్రేక్షకుల వినోదం కోసం కొన్ని కార్యక్రమాలను నిర్వహించారు. వీటికి వేరే సందర్భాలనేకం ఉన్నాయి.
ఇక, ఇంతటి మహత్తర ఘట్టంలో ఒక చక్కటి కవి సమ్మేళనం లేకపోవడం చింతించాల్సిన విషయం. ఆరోజు ఉద్దండరాయుని పాలెంలో ఉన్న దాదాపు లక్షమంది ప్రజలలో ఎంత మంది కవి సమ్మేళనాన్ని ఆస్వాదించగలరనే సందేహం కలగొచ్చు. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మొదటిది, ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నది కేవలం వేదిక ముందున్న లక్షమంది మాత్రమే కాదు. అంతకు వందరెట్లు ప్రపంచం నలుమూలల నుంచీ ఎలక్ష్రానిక్ మీడియా ద్వారా వీక్షిస్తున్నారు. తెలుగు సంస్కృతిలోని వైవిధ్యం, దాని విశిష్టత,
బలం ఆంధ్రేతరులకు కూడా తెలియజేయాల్సిన తరుణం అది. ఆనాటి పద్యపఠనంలో కూడా పాలకుల స్తుతే వినిపించింది. రెండవది, దేశ ప్రతిష్టనినుమడింపజేసిన, తెలుగుజాతికి గర్వకారణమైన మహాకవులు, అష్టావధానులు, శతావధానులు అనేకమంది మనకంధుబాటులో ఉన్నారు. ఛందస్సుకు భంగం కలగకుండా, సామాన్య ప్రజలకర్థమయ్యే భాషలో వారు ఖచ్చితంగా కవిత్వం చెప్పగలరు. మహాకవి శ్రీశ్రీ వ్యావహారిక భాషలో రాసిన “నేనుసైతం”
అనే ఛందోబద్ధమైన గేయం ఎవరి వద్ద లేదు? తెలుగురాని ప్రధానమంత్రి కూడా దాన్ని తెలుసుకుని ఆస్వాదించేరు కదా?
ప్రభుత్వం ప్రజల స్థాయిని పెంచాలి, శాప్రీయ కళలను ఆస్వాదించి, తరించే సామర్ధ్యాన్ని వారికి కలగజేయాలి. ఇక, అన్నిటికంటే ఎక్కువగా నిర్ణక్ష్యం చేయబడింది శాప్రీయ సంగీతం. కళాకారులంటె సినీనటులు, సినీగాయకులు, రచయితలు, దర్శకులు,
సంగీత నిర్దేశకులు మాత్రమే కారు. టి.వి. యాంకర్లు సైతం సెలబ్రిటీల స్థాయినందుకుంటున్న నేటి తరుణంలో విజయవాడకు అంతర్జాతీయ ఖ్యాతినార్జించి పెట్టిన 'పద్మవిభూషణ్, ‘సంగీత కళానిధి' డా॥మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి మహాగాయకులు కనీనం (ప్రత్యేక ఆహ్వానితులలో కూడా. కనబడకపోవం చాలా బాధాకరం. అశేషాంథధ్ర ప్రజల నీరాజనాలందుకుంటున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు,
సామవేదం షణ్ముఖ శర్మ, మేడపాని మోహన్గార్ల వంటి ఆధ్యాత్మికవేత్తలు,
కవిపండితులు, అవధానులు ప్రత్యేక ఆహ్వానితులలో లేకపోవడం చాలా ఆవేదన కలిగించింది. ఒక సినీ ఆర్మెస్ట్రాకో,
ఆడియో రిలీజ్కో,
టి.వి.షోలకో వచ్చినంత మంది జనం వారి ఆధ్యాత్మిక ప్రబోధాలు,
పండిత ప్రసంగాలను వినడానికి కూడా వస్తున్నారు. వారూ వి.ఐ.పిలే. మృదంగంపై శివతాండవం చేసి అంతర్జాతీయ బహుమతి నొంది,
24 గంటలు నిర్విరామంగా మృదంగం వాయించి గిన్నిస్ రికార్డ్ సృష్టించి, 'నవమృదంగ సమ్మేళనం’ వంటి వినూత్న ప్రక్రియల ద్వారా సామాన్య ప్రజలను ఉర్రూతూలూగించి, మృదంగ లయ విన్యాసం యొక్క మాధుర్యాన్ని ఇంటింటికీ అందించి విజయవాడకు ఎనలేని ఖ్యాతిని సంపాదించిపెట్టిన పద్మత్రీ. డా॥ ఎల్లా వెంకటేశ్వరరావుగారిని,
వారి సమకాలీన మహా విద్వాంసులను, తమిళసోదరులు కూడా శ్లాఘించి, నీరాజనాలర్పిస్తున్న ప్రౌఢ, యువ విద్వాంసులను మరచి, తమిళదేశస్థులైన శివమణి గారిచే ప్రదర్శననిప్పించడం ఏమి సబబు? ముఖ్యంగా నాదస్వరంపై వాయించిన “ఆడమోడి గలదా రామయ్య?”
అనే చారుకేశి రాగంలోని చక్కటి త్యాగరాజ కృతికి చిత్రవిచిత్ర ధ్వనులతో డ్రమ్స్పై వాయించడమనే ఆలోచనే అసంబద్ధంగా ఉంది. దీనికి ఫ్యూజన్ మ్యూజిక్ అని పేరు పెట్టి సమర్ధించొచ్చు. కానీ ప్రస్తుత సందర్భానికి అది సరిపోదు. “త్యాగయ్య గొంతులో తారాడునాదాలు” అని ఒకపక్క పాడుతూనే, మరోపక్క దైవచింతనలో లీనమై, తన్మయత్వంలో త్యాగయ్య గొంతు నుండి వెలువడిన ఆ కృతికి అటువంటి వాద్యసహకారం అందివ్వడం వారిని అవమానించడమే అవుతుంది. ఇక్కడ తప్పు శివమణి గారిది కాదని గమనించాలి. వారు మహావిద్వాంసులు. వారికి తోచినది, చేతనైనది వారు వాయించారు. ఈ సందర్భంలో, ఈ వేదికపైకి వారిని ఆహ్వానించకుండా ఉండాల్సింది. ఆంధ్రుల రాజధాని అమరావతి శంఖు స్థాపనకు, శివమణిగారికి సంబంధం ఏమిటి? ఈ కార్యక్రమాలను తిలకించిన తమిళసోదరులు ఇక్కడ కూడా తమ వారినే చూసి తెలుగునాట సంగీతం, మంచి కళాకారులు లేరనే నిర్ధారణకు వస్తారు. ప్రస్తుతం ఆంధ్రదేశంలో మేధోవలస జరుగుతోంది. విద్వత్తు ఉన్నవారు అయితే తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలకు వలస పోతున్నారు లేదా శాస్రీయ సంగీతాన్ని వదిలేసి బ్రతుకుదెటువు కోసం వేరే ఉపాధి అవకాశాలను వెదుక్కుంటున్నార్లు.
కూచిపూడి అభివృద్ధికోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వం శాప్రీయ సంగీతాభివృద్ధికి ఎంత సహాయం చేస్తోంది?
సంగీత కళాశాలలో అధ్యావకుల ఉద్యోగాలనెన్నిటినో భర్తీ చెయ్యలేదు. నేటికీ కొద్దిపాటి జీతాలతో,
ఒప్పంద పద్ధతిలోనే కళాకారులచే బోధన చేయిస్తున్నారు. విద్యావేత్తల, మేధావుల సూచనలననుసరించి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సంగీతోపాధ్యాయులను నియమించి, పిల్లల మానసిక వికాసానికి తోడ్పడాలి. ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఈ నియామకాలు చెయ్యాల్సిందిగా నిబంధన విధించాలి. శరీర సౌష్టవానికి, ఆరోగ్యానికి వ్యాయామం,
క్రీడలు ఎంత అవసరమో,
మానసిక, వ్యక్తిత్వ వికాసానికి సంగీతం, శాస్త్రీయ కళలు అంతే అవసరం. పాశ్చాత్య సంగీతం తమోగుణాన్ని ప్రేరేపిస్తే భారతీయ శాప్రీయ సంగీతం సత్వగుణాన్ని ప్రేరేపిస్తుంది.
సుఖజీవనానికి సరిపడేంత కనీస ఆదాయాన్నివ్వలేని విద్యను నేర్చుకోమని పిల్లలకు, యువకులకు ఎలా చెప్పగలం? అందుకే సంగీతం నేర్చుకునే వారికి ఉపకారవేతనాలు, ప్రోత్సాహకాలు అంధివ్వాలి. శాప్రీయసంగీతం నేర్చుకుంటే ఆర్ధికంగా నష్టపోమనే ధీమాని కలిగించాలి. వృద్ధ కళాకారులకు పింఛనులివ్వాలి. సాంస్కృతిక శాఖ పరిపాలనా విభాగంలో శాప్రీయసంగీత నేపధ్యం ఉన్నవారినే అధికారులుగా నియమించాలి. తెలుగువారి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీ ఎన్.సి.హెచ్. కృష్ణమాచార్యులు,
శ్రీ అన్నవరపు రామస్వామి మొదలుగా శతాధికంగా శిష్యులను విజయవాడలో గురుకుల పద్ధతిలో తయారుచేసిన ‘గాయక సార్వభౌమ’
పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి జయంతి, వర్ధంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. విజయవాడ నగరంలో సంగీత కచేరీలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా చక్కటి ధ్వని ప్రమాణాలతో, అన్ని హంగులు గల ఎ.సి. ఆడిటోరియం లేకపోవడం విచారకరం. విజయవాడకు ఆకాశవాణి కేంద్రం రావడంలో కీలకపాత్ర పోషించిన శ్రీ రామకృష్ణయ్య పంతులుగారి పేరిట ఒక ఆడిటోరియంను వెంటనే నిర్మించాలి. కర్టాటక సంగీత ప్రపంచంలో వయోలన్ అనగానే మొదటగా గుర్తుకువచ్చే 'పద్మత్రీ ద్వారం వెంకటస్వామినాయుడు గారి పేరిట,
ఫిజీషియన్ మరియు మ్యుజీషియన్గా పేరుగాంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి “పద్మభూషణ్” డా॥శ్రీపాదపినాకపాణి గారి పేరిట ప్రభుత్వపరంగా ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలి, అవార్డులు ప్రదానం చెయ్యాలి. సంస్కృతీ సాంప్రదాయాల పరిరక్షణ, వ్యాప్తిపైనే ఒక జాతికి అస్థిత్వం,
గుర్తింపు, గౌరవం లభిస్తాయి.
అడ్డగోలుగా విభజించబడి, అయోమయంలోకి నెట్టబడిన తెలుగు ప్రజలు, పాలకులు పౌరుషాన్ని తెచ్చుకుని తమ సంస్కృతిని పరిరక్షించుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇంతవరకు నేను రాసినవన్నీ నా దృష్టికోణంలో నాకు అర్థమైనవే తప్ప, ప్రభుత్వాన్నివిమర్శించాలనే దురుద్దేశ్యం నాకు లేదు. లోపం ప్రభుత్వంలో లేదు-మన ఆలోచనలో,
వ్యవస్థలోనే ఉంది. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నేటి పవిత్ర తరుణంలో సింగపూర్,
జపాన్ వంటి దేశాల సాంకేతిక సహకారం చాలా అవసరం. అయితే అమరావతి భౌతిక నిర్మాణంలో, పాలనా వ్యవహారాలలో తెలుగుదనం ఉట్టిపడాలి. ఆంధ్ర సాంస్కృతిక, ఆధ్యాత్మిక వాతావరణమే అమరావతి ఆత్మకావాలి. అప్పుడే అది అఖిలాంధ్ర ప్రజారాజధానిగా చరిత్రలో నిలిచిపోతుంది.
- కె.సద్గురుచరణ్,
టాప్గ్రేడ్ నిలయవిద్వాంసులు (మృదంగం)
ఆకాశవాణి, విజయవాడ-10
సెల్: 9440709994
Comments
Post a Comment